ప్రజాశక్తి-అమరావతి : వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనర్హత పిటిషన్‌లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయింపు పిటీషన్‌పై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీలో విచారణకు హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుపై నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి మరింత గడువు కావాలని కోరారు. స్పీకర్ ఎదుట విచారణ సందర్భంగా వైసిపి రెబల్ ఎమ్మెల్యేలు మెమో దాఖలు చేశారు. న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు, పేపర్, వీడియో క్లిప్పింగుల నిజనిర్ధారణకు సమయం అవసరమని, పిటిషన్ దాఖలు తర్వాత రిప్లైకి 30 రోజుల సమయం కావాలని కోరామని తెలిపారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు స్పీకర్‌తో భేటీ తర్వాత తెలిపారు.
