రామోజీరావు మృతికి ఏచూరి, బి.వి.రాఘవులు సంతాపం

విజయవాడ : ఈనాడు సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు మరణం బాధాకరమని సిపిఐ(యం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. రామోజీరావు తెలుగు మీడియా రంగానికి నూతన ఒరవడి దిద్దారని, పత్రికా విలువలు నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. సుందరయ్య, రాజేశ్వరరావు లాంటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుల్ని రామోజీరావు ఎంతో అభిమానించేవారని తెలియజేశారు. రామోజీరావు మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి లోటని పేర్కొన్నారు.

➡️