చికాగో (అమెరికా) : అమెరికాలోని చికాగోలో దుండగులు జరిపిన కాల్పులో ఖమ్మం యువకుడు మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం రూరల్ జిల్లా రామన్నపేటకు చెందిన సాయి తేజ (26) ఎంఎస్ చదువుకోవడానికి 4 నెలల క్రితం అమెరికాకు వెళ్లాడు. అయితే చికాగోలో జరిగిన దుండగుల కాల్పుల్లో సాయి తేజ మరణించాడు. సాయి తేజ మరణంతో రామన్నపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమారుడి మరణవార్తతో అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. యువకుడి మఅతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.