యువరైతు ఆత్మహత్య

Dec 7,2024 21:24 #atmakur, #Farmer, #suside

ప్రజాశక్తి – ఆత్మకూరు : అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పంపనూరు గ్రామానికి చెందిన నరేష్‌ (25) ఉపాధి హామీ చట్టం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. దీంతో పాటు తనకున్న ఐదెకరాల పొలం సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంటల సాగు, బోర్లు వేసేందుకు దాదాపు రూ.ఎనిమిది లక్షల వరకు అప్పులు చేశారు. అప్పులకు వడ్డీ భారం అధికం కావడం, పంటలు దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇంటి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్ష్మీనారాయణ తెలిపారు.

➡️