ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ‘న్యూటన్ సిద్దాతంతం ప్రకారం ‘ ప్రతి చర్యకూ… ప్రతి చర్య ఉంటుంది’ చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో అంతే వేగంతో అది పైకి లేచి ఆయనకే తగులుతుంది’ అని వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల వైసిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి టిడిపి నేతలు వెళ్తారని అన్నారు. మనరాష్ట్రంతో పాటు తమిళనాడులో కూడా ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశామని, వైసిపి కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా , ఐక్యంగా ఉండాలన్నారు. అబద్దపు హామీలతో బాబు ప్రతి ఒక్కరినీ మోసం చేశారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అటకెక్కించారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వైసిపి అని గర్వంగా చెప్పుకుంటూ ప్రతి కార్యకర్త ప్రజలవద్దకు వెళ్లగలరన్నారు. విలువలు, విశ్వసనీయతే పార్టీ సిద్ధాంతమని వైఎస్ జగన్ అన్నారు. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవని, చీకటి వచ్చిన తర్వాత వెలుతురు తప్పక వస్తుందన్నారు.
