తాడేపల్లి (అమరావతి) : అనకాపల్లి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై వైసిపి అధినేత వైఎస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడంపై విచారం వ్యక్తం చేశారు. మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడినవారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైసిపి నాయకులకు సూచించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు.
