తాడేపల్లి (అమరావతి) : ‘ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగభాగ్యాలు నింపాలి’ అని వైసిపి అధినేత వైఎస్.జగన్ ఆకాంక్షించారు. నేడు భోగి పండుగను పురస్కరించుకొని … వైఎస్.జగన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ”తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఈ పండుగ అందరి కుటుంబాల్లో భోగ భాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ” అని చెప్పారు.
