రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు : వైఎస్‌.జగన్‌

తాడేపల్లి : నేడు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని …. రాష్ట్ర ప్రజలందరికీ వైసిపి అధినేత వైఎస్‌.జగన్‌ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్‌ ట్వీట్‌ చేశారు. ” రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఆథ్యాత్మికంగా శక్తినిచ్చే ఈ పండుగ ప్రజలందరినీ ఏకం చేస్తుంది. చెడును నిర్మూలించి ధర్మాన్ని కాపాడడంలో శ్రీకృష్ణుడి బోధనలు మానవాళికి ఆచరణీయం. మనందరిపైన, రాష్ట్రంపైన శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

➡️