వైఎస్‌ జగన్‌ ఆస్తుల కేసు విచారణ వాయిదా

Apr 18,2024 17:16 #ap cm jagan, #CBI charge sheet

హైదరాబాద్‌ : ఏపీ సిఎం జగన్‌ ఆస్తుల కేసుల విచారణ నేడు నాంపల్లి సీబీఐ కోర్టులో ఈ కేసుల విచారణ చేపట్టారు. జగన్‌, ఇతర నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. సీబీఐ, ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 30కి వాయిదా వేసింది. మరోవైపు, జగన్‌ ఆస్తుల కేసులో ట్రయల్‌ నత్తనడకన నడస్తుండడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐని ప్రశ్నించింది. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఉంటుందా? అని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల విచారణలో ప్రశ్నించింది.

➡️