సహజ వనరుల దోపిడిపై సిబిఐ విచారణ : వైఎస్‌ షర్మిల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి హయాంలో జరిగిన మైనింగ్‌ దోపిడీపై ఎసిబి విచారణతో పాటు పూర్తి స్ధాయిలో సమగ్ర దర్యాప్తు జరపాలని, అదే విధంగా సహజ వనరుల దోపిడిపై సిబిఐతో విచారణ జరిపించాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీపై ఆ నాటి మైనింగ్‌ ఎండి వెంకటరెడ్డి లాంటి వారే కాకుండా, ప్యాలెస్‌లో ఉన్న తెరవెనుక సర్వం తానై వేల కోట్లు కాజేసిన ఆ ఘనాపాటి ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. ఐదేళ్లుగా అస్మదీయ కంపెనీలకు మైనింగ్‌ కాంట్రాక్టులిచ్చి అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారని ఆమె ఆరోపించారు.

➡️