ఈనెల 5న కడప నుంచే వైఎస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం !

కడప: ఈ నెల 5వ తేదీన నుంచే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన సొంత గడ్డ కడప నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కడప జిల్లాలో ఎనిమిది రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రజలతో కలిసే విధంగా ఈ షెడ్యూల్‌ ఉంది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ షర్మిల పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

వైఎస్‌ షర్మిల కడప షెడ్యూల్‌:
5వ తేదీ: కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, గోపవరం
6వ తేదీ: బద్వేల్‌, అట్లూరు, కడప
7వ తేదీ: దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బి. మఠం
8వ తేదీ: కమలాపురం, వల్లూరు చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయిని పల్లి
10వ తేదీ: చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల
11వ తేదీ: తొండూరు, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం
12వ తేదీ: జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం

➡️