ప్రజాశక్తి-పలమనేరు : ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని రాజంపేట ఎంపి మరియు లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తెలిపారు. బుధవారం పలమనేరు పట్టణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యం లో నిర్వహించిన 4 విడత వై.యస్.ఆర్ ఆసరా కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపి విచ్చేయగా.. చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డెప్ప, ఎం ఎల్ సి భరత్, పలమనేరు ఎం ఎల్ ఏ వెంకటె గౌడ్ లు లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహిళలను ఉద్దేశించి రాజంపేట ఎంపి మరియు లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల అప్పులను 4 విడతలలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వై.యస్.ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి వంద శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డిదే అని తెలిపారు. వై.యస్.ఆర్ ఆసరా క్రింద పలమనేరు పట్టణంలోని 6,732 మంది ఎస్ హెచ్ జి మహిళలకు సంబందించి మొత్తం రూ.30.85 కోట్లు రుణాలు కాగా గతంలో మూడు విడతలలో రూ.23.14 కోట్లు జమ చేయగా, 4వ విడతలో రూ.7.71 కోట్ల నిధులు జమ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో దాదాపు 10వేల ఇంటి పట్టాలు మంజూరు చేసి గృహ నిర్మాణానికి తోడ్పడుతున్నామన్నారు. హంద్రీ-నీవా కాలువ ద్వారా కుప్పం నియోజక వర్గం కు నీరు అందించడం జరుగుతుందన్నారు.
చిత్తూరు ఎంపి ఎన్. రెడెప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేదల సంక్షేమం కొరకు నవరత్నాల ద్వారా పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్య విధానాలలో సమూల మార్పులు తీసుకువచ్చి పేద ప్రజలకు కార్పొరేట్ తరహాలో విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తున్నరన్నారు. అక్కచెల్లెమ్మాలను ఆర్థికంగా ఆదుకుని వారి కుటుంబ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్నారన్నారు. పలమనేరు ఎంఎల్ఏ వెంకటెగౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలను ఋణ విముక్తులను చేసే దిశగా అడుగులు వేసి వై.యస్.ఆర్ ఆసరా ద్వారా 4 విడతలలో డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు, కుప్పం మున్సిపల్ ఛైర్మన్లు చాముండేశ్వరి, డా.సుధీర్, పలమనేరు మున్సిపల్ వైస్ ఛైర్మన్లు రవి, గుల్జార్, పలమనేరు ఆర్డిఓ మనోజ్ రెడ్డి, కమిషనర్ రమణారెడ్డి, మెప్మా పిడి రాధమ్మ, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.