ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని నేటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపసంహరించుకోకపోవడం దారుణమని వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు వై.మస్తానప్ప అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 1273వ రోజుకు చేరాయి. దీక్షల్లో వైఎస్‌ఆర్‌టియుసి కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఐక్యంగా పోరాడి విశాఖ ఉక్కును కాపాడుకుని తీరుతారన్నారు. రాష్ట్ర, విశాఖ అభివృద్ధిలో ఉక్కు కర్మాగారం విశేష పాత్ర పోషించిందని తెలిపారు. లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని, వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
