Jan 26,2022 00:13

జెండా ఊపి ప్రారంభిస్తున్న డిఎంహెచ్‌ఒ రామగిడ్డయ్య

ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్‌: కరోనా వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం పై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి.రామ గిడ్డయ్య అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వ్యాక్సినేషన్‌ ప్రచార రథాన్ని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ రామగిడ్డయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి గ్రామంలో ప్రచార రథం తిరుగుతుందన్నారు. కరోనా పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు , కోవిడ్‌ టికా ప్రాముఖ్యతను తెలియజేస్తు ప్రజలను చైతన్యవంతం చేస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్‌ విజన్‌ ఇండియా ప్రతినిధి శ్రీనివాస్‌, సజీర్‌, అహ్మద్‌ పాల్గొన్నారు.