Sep 19,2023 22:56

ప్రజశక్తి - చీరాల
స్థానిక ఎంఆర్‌సి భవనంలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వర చేతుల మీదగా మంగళవారం ఆవిష్కరించారు. బాపట్ల జిల్లా సేవాదళ్ కో ఆర్డినేటర్ ముంగర రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 26నుండి 29వరకు రాష్ట్ర స్థాయిలో కళాశాలలు, పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు జరుగుతయని అన్నారు. వ్యాసరచనలో డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులకూ మానవత్వంను పెంపొందించు విద్యావశ్యకత అనే అంశం, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ విద్యార్థులకుకి ప్రకృతియే ఉత్తమ గురువు, 8నుండి 10వ తరగతి విద్యార్ధులకు ఆచార్యదేవోభవ అనే అంశంపై పోటీలు ఉంటాయని తెలిపారు. తెలుగు, ఇంగ్లీషు బాషలలో పోటీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు కొట్లబజారులోని సత్యసాయి మందిరం వద్ద సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.