Jun 23,2021 16:36

ఆలమూరు (తూర్పు గోదావరి) : ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత భద్రతతో మెలుగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యాధికారి డాక్టర్‌ కె.కన్యాకుమారి అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ నందు పలువురు రోగులకు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బుధవారం ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా నియంత్రణకు 45 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆమె అన్నారు. అలాగే ఐదేళ్లలోపు పిల్లల తల్లులు కూడా వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు తప్పక పాటించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్‌ గోపి రామ్‌, డాక్టర్‌ వాసవి పాల్గొన్నారు.