Jul 04,2022 00:08

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అమర్నాథ్‌

మంత్రి అమర్‌నాథ్‌
ప్రజాశక్తి -అనకాపల్లి : వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి, అభివద్ధి చేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని వెంకుపాలెం గ్రామంలో ఎంపిపి గొర్లి సూరిబాబు అధ్యక్షతన రైతులకు వరి విత్తనాల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ గడచిన మూడేళ్లలో వ్యవసాయ రంగానికి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రూ.20 వేల కోట్లను వెచ్చించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో విత్తనాలు ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో రోజుల తరబడి ఎదురు చూసే వారన్నారు. తమ ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ముంగిటకే వ్యవసాయరంగానికి కావలసిన పనిముట్లు, ఎరువులు, విత్తనాలు అందజేస్తున్నట్లు తెలిపారుఎంపీపీ సూరిబాబు మాట్లాడుతూ ఈ క్రాప్లో ప్రతి రైతు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌ కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లి బాబు, సర్పంచు రాపేటి నాగేశ్వరరావు, ఎంపిటిసి వెంకటేశ్వరరావు, వైస్‌ ఎంపిపి అయిత రాము, క్షత్రియ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వర్మ, ఏ డి ఏ రామారావు, ఏఎంసి డైరెక్టర్‌ శోభ పాల్గొన్నారు.