Jun 23,2021 16:38

హైదరాబాద్‌ : కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సినీ, క్రీడా ప్రముఖులు చాలా మంది తమ ఫామ్‌హౌస్‌లలో వ్యవసాయ క్షేత్రాలలో గడిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అయితే, తాజాగా టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌ కూడా వ్యవసాయం చేస్తూ లాక్‌డౌన్‌ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తాజాగా అతడు తన ఫాంహౌస్‌లో పండించిన పండ్లను స్వయంగా అమ్మాడు. తోటలో కాసిన మామిడి, నేరేడు పండ్లను తన కార్యాలయానికి తీసుకొచ్చి.. అక్కడ వాటిని కిలో రూ.50 చొప్పున అమ్మి రూ.3,600 సంపాదించాడు. అయితే, నటుడిగా సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకుంటే వచ్చే సంతోషం కన్నా.. వీటిని అమ్మినందుకు పొందిన ఆనందమే ఎక్కువగా ఉందని, కష్టపడి వ్యవసాయం చేయడంలోనే అసలు సిసలైన మజా ఉందని అంటున్నాడు. ఆయన పండ్లు అమ్ముతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.