Mar 19,2023 17:53

న్యూఢిల్లీ  :   నడిరోడ్డుపై ఓ యువతిని దుర్భాషలాడుతూ బలవంతంగా కారులో ఎక్కించడంతో పాటు ఆమెపై దాడికి దిగాడు.  ఢిల్లీలోని మంగోల్‌పురి ఫ్లైఓవర్‌ కింద ఈ ఘటన జరిగింది. యువతిని దుర్భషలాడుతూ.. బలవంతంగా కారులో ఎక్కిస్తుండగా మరో ప్రయాణికుడు గానీ.  ఆ కారులో ఉన్న డ్రైవర్‌ గానీ అడ్డుకునేందుకు యత్నించలేదు. చుట్టుపక్కల ఉన్నవారు సైతం పట్టించుకోకుండా వెళతుండటం గమనార్హం.   ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో ఆధారంగా ఈ ఘటనను సుమోటోగా తీసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని డిప్యూటీ కమిషనర్‌ హరేందర్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. కారు  నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా.. క్యాబ్‌ డ్రైవర్‌ గురుగ్రామ్‌కి చెందిన వాడిగా గుర్తించామని.. విచారణ జరిపేందుకు అక్కడికి ఓ బృందాన్ని పంపించామని హరేందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.  క్యాబ్‌  చివరిగా గురుగ్రామ్‌లోని ఐఎఫ్‌ఎఫ్‌సిఒ చౌక్‌ దగ్గర శనివారం రాత్రి 11.30 గంటలకు ఆగినట్లు తెలిపారు. ఆ క్యాబ్‌ని ఉబర్‌ యాప్‌ ద్వారా రోహిణి నుండి వికాస్‌పురికి బుక్‌ చేశారని, దారి మధ్యలో ఈ ఘటన జరిగిందని చెప్పారు.