Sep 25,2021 12:30

శృంగవరపుకోట (విజయనగరం) : ఈ నెల 27 న చేపట్టనున్న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ... శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో శృంగవరపుకోటలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీతంపేట నుండి ఎస్‌.కోట సాయిబాబా గుడి వరకు ఇసుక టైరు బండ్లతో ర్యాలీ సాగింది. మరోవైపు ఎడ్లబండ్లపై రైతన్నలు భారీ సంఖ్యలో వరుసక్రమంలో ర్యాలీగా సాగారు. ఈ ర్యాలీని శృంగవరపుకోట పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీలో పాల్గొన్నవారిని బలవంతపు అరెస్టులు చేశారు.