Sep 29,2022 16:04

ప్రజాశక్తి - విజయవాడ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి ఆలయ అధికారుల తీరు చర్చనీయంశమైంది. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు రూ.3000లతో టిక్కెట్‌ కొంటే అంతరాలయ దర్శనం ఇవ్వడం లేదంటూ ఆలయ అధికారుల తీరుపై ఉభయదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఈవో భ్రమరాంబను ఉభయదాతలు నిలదీశారు. అయితే వారికి నచ్చజెప్పాల్సిన ఈవో...''ఉభయదాతలకు దండం పెడుతూ.. నేను అంతరాలయ దర్శనం ఇవ్వను. ఏమి చేసుకుంటారో చేసుకోండి. నాతో గొడవ పడితే మీ మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తాను'' అంటూ హెచ్చరించారు. మీడియా జరిగిన దాన్ని వీడియో తీస్తుండగా ''మీకు వీడియోలు తీయడం సరదానా'' అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఏడాది ఉభయ దాతలకు అంతరాలయ దర్శనం, గోత్రనామాలను చదివి, పాదుకలు ఇచ్చి పెట్టి , ఆశీర్వచనం అందించడం జరుగుతుందని, అయితే వీరి విషయంలో ఈవో వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారు