Mar 18,2023 16:39

ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక గాంధీ సర్కిల్ నందు ఉన్న చేతిపంపు గత కొన్ని రోజులుగా రిపేర్ లో ఉన్నది. గాంధీ సర్కిల్ నందు ఉన్న చిరు వ్యాపారస్తులు పంచాయతీ సెక్రెటరీ అశ్వర్త్ నాయుడు, సర్పంచ్ సుప్రియ కు విన్నవించగా వేసవికాలంను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ ఆవరణంలో నీటి ఎద్దడి లేకుండా తక్షణమే పంచాయతీ సిబ్బంది ద్వారా రిపేరు చేయించారు. సమస్య తెలిపిన వెంటనే స్పందించిన సర్పంచుకు పంచాయతీ కార్యదర్శి, స్థానిక చిరు వ్యాపారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.