Jun 29,2022 11:28

భారతీయ సంప్రదాయాల ప్రకారం.. వివాహ వేడుకల్లో భాగంగా వరుడు కాళ్లకు వధువు నమస్కరించాలి. సాంప్రదేయతరులు దీన్ని వ్యతిరేకిస్తున్నా.. ఈ చర్య కొనసాగుతూనే ఉంది. అయితే వధువు కాళ్లను నమస్కరిస్తున్న వరుడు వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోలో వధువుకు నమస్కరించిన అనంతరం ఆమెను వరుడు కౌగిలించుకున్నారు. ఆన్‌లైన్‌లో సంచలనం సఅష్టిస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇద్దర్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లెక్కలేనన్నీ లైక్స్‌ వస్తున్నాయి. ఆ యువతి దితి గోరాదియాగా తెలుస్తోంది. తనే తన వివాహం నాటి ఈ వీడియోను నెట్టింట్లో షేర్‌ చేసుకున్నారు. ఆమె భర్త పేరు ఆర్నవ్‌. తన కాళ్లకు నమస్కారం చేసిన తర్వాత ఆర్నవ్‌ తన చెవిలో 'నువ్వ లక్కీగార్ల్‌' అంటూ గుసగుసలాడారని చెప్పుకొచ్చారు. దీనిపై నెట్టింట్లో కామెంట్లు కూడా వస్తున్నాయి. 'నేను ఈరోజు ఇంటర్నెట్‌లో చూసిన అత్యంత ఆరాధనీయమైన విషయం' అని నెటిజన్‌ కామెంట్‌ చేయగా... మరొక యూజర్‌ 'దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. అమ్మా నువ్వు రత్నాన్ని కనుగొన్నావు' అని రాశాడు.

                     https://www.instagram.com/reel/Ce6Q6unlTg9/?utm_source=ig_web_copy_link