Sep 25,2021 12:15

పశ్చిమ గోదావరి : ఈ నెల 27 న చేపట్టనున్న భారత్‌ బంద్‌ ని విజయవంతం చేయాలని... సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. శనివారం తణుకులోని స్ధానిక సిపిఎం కార్యాలయంలో విలేకరులతో సీతారాం మాట్లాడుతూ... దేశ సంపదను కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాల నుండి దేశాన్ని కాపాడుకోవాలని కోరారు. 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌ను అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.