Oct 10,2021 14:57

ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ను బ్లాక్‌ చేయడం తెలుసు కానీ మన వాట్సాప్‌ ఖాతాను కూడా బ్లాక్‌ చేయవచ్చని మీకు తెలుసా... మన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ పై రిపోర్ట్‌ చేస్తే ఫేస్‌ బుక్‌ ఎలా అయితే ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ని బ్లాక్‌ చేస్తుందో అలానే వాట్సాప్‌ ఖాతాను కూడా వాట్సాప్‌ బ్లాక్‌ చేస్తుంది. ఎలాంటి సందర్భాలలో బ్లాక్‌ చేస్తుందో తెలుసుకుందాం.....
థర్డ్‌ పార్టీ, లేదా మోడెడ్‌ వాట్సాప్‌ యాప్‌లను వాడుతున్నపుడు.... అంటే వాట్సాప్‌కు బదులుగా ఇతర క్లోనింగ్‌ యాప్స్‌ వినియోగించడం వలన. జీబీ వాట్సాప్‌, వాట్సాప్‌ ప్లస్‌, వాట్సాప్‌ మోడ్‌ యాప్‌లను ఉపయోగించే వారివి ఖాతాలను వాట్సాప్‌ తొలగిస్తుంది. ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీకి భంగం వాటిల్లితుందని చెబుతున్నారు. అలాగే తెలియని నంబర్లకు స్పామ్‌ మెసేజ్‌లను పంపితే వాట్సాప్‌ ఆయా యూజర్లను బ్లాక్‌ చేస్తోంది. ఆయా యూజర్లకు అనుమతి లేకుండా మెసేజ్‌లను పంపితే బ్లాక్‌ చేస్తోంది. రెసిపెంట్‌ ఒక వేళ మీరు పంపినా మెసేజ్‌లను స్పామ్‌గా గుర్తించి వాట్సాప్‌కు రిపోర్ట్‌ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతాలు బ్లాక్‌ అవుతాయి. తెలుసుకున్నారు కదా... వాటి జోలికి పోకుండా వాట్సాప్‌ ను చక్కగా వినియోగించుకోండి. అక్టోబర్‌ 4 న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలను ఏడు గంటలపాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే.