Aug 01,2022 18:15

న్యూఢిల్లీ : సోమవారం కూడా ధరల పెరుగుదలపై పార్లమెంట్‌ దద్ధరిల్లింది. విపక్షాలు ఆందోళనలు, వాయిదా పర్వం, కాంగ్రెస్‌ ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేతతో నేడు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. అయితే ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ధరల పెరుగుదలపై తృణమూల్‌ ఎంపి కాకోలి ఘోష్‌ దస్తిదార్‌ ఓ పచ్చి వంకాయను కొరికారు. దేశంలో గ్యాస్‌ ధరలు కొండనెక్కుతున్నాయని పేర్కొంటూ.. దీంతో పేదలు వండుకోవడమ మానేశారని, పచ్చి కూరగాయలే వారికి దిక్కు అంటూ వినూత్ననంగా నిరసన తెలిపారు. ' ధరల పెరుగుదలపై చర్చకు అనుమతించినందుకు ధన్యవాదాలు. కొన్ని నెలల వ్యవధిలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధరను నాలుగు సార్లు పెంచారు. ఒకప్పుడు రూ.600గా ఉన్న గ్యాస్‌ ధర ఇప్పుడు రూ.1100 దాటేసింది. పేదలకు వంట చేసుకోవడం భారంగా మారింది. ప్రజలు పచ్చి కూరగాయలు తిని బ్రతకాలని ప్రభుత్వం కోరుకుంటుందా?' అంటూ ప్రశ్నించారు. ఆ సందర్భంగా పచ్చి వంకాను కొరికారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. అదేవిధంగా గ్యాస్‌ ధరను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

 <