
న్యూఢిల్లీ : రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌పై తీవ్ర చర్యలకు కాంగ్రెస్ సిద్ధమైంది. గతవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్‌గెహ్లాట్ సచిన్‌పైలెట్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సచిన్ ఓ ద్రోహి, విశ్వాస ఘాతకుడని, అతను ఎన్నటికీ సిఎం కాబోడని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గన్న జైరాం సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు చేశారు. సచిన్ పైలెట్‌పై ఆ పదాలు ఉపయోగించకుండా ఉండాల్సిందని అన్నారు. అవసరమైతే.. రాజస్థాన్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు కఠిన మైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనుకాడదని అన్నారు. వారిరువురి మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ.. అశోక్ గెహ్లాట్ నుండి అటువంటి వ్యాఖ్యలు ఊహించలేదని, షాక్‌కు గురిచేశాయని అన్నారు. రాజస్థాన్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, అవసరమైతే ఇందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా తప్పదని అన్నారు. ఒకవేళ సచిన్, అశోక్ గెహ్లాట్‌లు రాజీ పడాల్సిరావచ్చని అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కొనసాగుతోంది.