Nov 25,2022 15:27

ప్రజాశక్తి-ముసునూరు : గురువారం విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం నందు 'స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ముసునూరు మండలం నుండి జిల్లా స్థాయి పోటీలకు ఇద్దరు విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 14 విభాగంలో త్రో బాల్ పోటీల్లో పాల్గొన్నారని హెచ్.ఎం,ఎం.శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సందర్భంగా జడ్పీహెచ్ఎస్  పాఠశాల నుండి అండర్ 14 త్రోబాల్ పోటీలో పాల్గొన్న ఎనిమిదో తరగతి విద్యార్థి పచ్చిగళ్ళ ఐశ్వర్య, ఏడో తరగతి విద్యార్థి పిన్ని బోయిన శ్రీవల్లి రాష్ట్రస్థాయి అండర్ 14 త్రో బాల్ పోటీలకు ఎన్నికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ సుకుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నికైన విద్యార్థులను పాఠశాల హెచ్.ఎం, శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులైన అల్లాబక్షు నాగేశ్వరావు రంగారావు  తదితరులు ప్రత్యేకంగా అభినందించారు.