
వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక షాదీఖాన నందు గురువారం నిర్వహించిన వాలంటీర్లకు సన్మానం కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ముఖ్య అతిధిగా హాజరై వాలంటీర్లను సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూగాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్యేయమని వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పేర్కొన్నారు. జగనన్న పాలనను చూసి దేశమంతా రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. టిడిపి పాలనలో నెల ప్రారంభమై వారం రోజులైనా పింఛన్ అందని పరిస్థితి ఉండేదని క్యూలో గంటల తరబడి నిల్చొని తీసుకునేవారని గుర్తు చేశారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని ఒకటవ తేదీ తెల్లవారక ముందే లబ్ధిదారులకు వాలంటీర్లు సొమ్ము అందిస్తున్నారన్నారు అని.ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వలంటీర్ ని కేటాయించటం జరిగింది.వారి పని తీరును గుర్తించి ప్రభుత్వం వారికి సేవవజ్ర, సేవరత్న, సేవమిత్ర పురస్కారాలను అందించటం జరుగుతుందన్నారు. ఉత్తమ సేవలు అందించిన నార్పల-3 సంబంధించిన వలంటీర్ సి.రాంబాబుకు సేవ వజ్ర అవార్డ్, సి.వీరనారప్ప(బి.పప్పూరు) యం. గంగాభవాని (బొందలవాడ), జి. రాజు (నార్పల-3),యం. బ్రంమేశ్వరయ్య (నాయనపల్లి),బి. మధు(సిద్దారచర్ల) వీరికి సేవామిత్ర అవార్డ్ లను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, చేతుల మీదుగా ప్రదానం చేసి సత్కరించి వలంటీర్స్ కు సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, జిల్లా వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగ రత్నమ్మ, ఎంపీపీ నాగేశ్వరరావు ఎంపీడీఓ దివాకర్, సర్పంచ్, సుప్రియ సింగల్ విండో అధ్యక్షులు, లోకనాథ్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మిద్దె కుళ్లాయప్ప ఉప సర్పంచ్ శ్రీరాములు ఎంపీటీసీలు, సర్పంచులు, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు...