Sep 30,2022 15:43

ప్రజాశక్తి-మడకశిర : సమ సమాజంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని ఆర్థిక స్వాలంబన దిశలో పయనింప చేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు. శుక్రవారం మడకశిర పట్టణంలోని వైయస్సార్ సర్కిల్  లో మూడవ విడత చేయూత పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ ప్రతి మహిళ ను లక్షాధికారి చేయాలని దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలుకన్నారని ఆయన పేర్కొన్నారు. ఈనే పత్యంలోనే  తనయుడు జగన్మోహన్ రెడ్డి ఈ కలను నెరవేరుస్తున్నారు. హర్ష ధ్వనుల నడుమ తెలిపారు. ఈ నేపద్యంలోనే  అమ్మ వాడి చేయూత లాంటి పథకాలు అర్హులైన మహిళలకు ఎలాంటి పక్షపాతం లేకుండా మంజూరు చేస్తున్నామన్నారు. చేయూత పథకం ద్వారా మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సౌకర్యం కూడా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాలలో 50 శాతం ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజా మహిళా వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ను ఎట్టి పరిస్థతుల్లో నమ్మే పరిస్థతిలో లేరన్నారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఆ కుటుంబాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో అనేక  సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి పై ప్రతిపక్షం నాయకులు ఎన్నో అబాండాలు వేస్తున్నారని అటువంటి వారిని రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజల క్షమించకుండా వారికి తగిన గుణపాఠం చెబుతారు అన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలే ప్రభుత్వంకు శ్రీరామరక్షలా నిలిచి గద్దెనెక్కిస్తాయని ధీమా వ్యక్తం చేసారు. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజల నుండి ఏవైనా సమస్యలు ఉన్నాయని ఆరాధిస్తుంటే ప్రజలు వైసీపీ ప్రభుత్వ పాలనలో తమ సంతోషంగా ఉన్నామని  పేర్కొంటున్నారని ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలియజేశారు. మడకశిరనగర పంచాయతీలో 1202 మందికి 2.25 కోట్లు, మడకశిరరూరల్ లో 392424 మందికి 7,35,75000 వేల రూపాయలు 45 నుండి 60 సంవత్సరాల వయసుగల మహిళలకు చేయూత కింద ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఒక్కలిగా కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నలిని రంగె గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీనరసింహ, ఎంపీపీ కవిత, జడ్పిటిసి సభ్యురాలు సరోజమ్మ, ఎంపీడీవో నరసింహమూర్తి, మున్సిపల్ అధికారులు, గ్రామపంచాయతీ సర్పంచులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, మున్సిపల్ పారకవర్గ సభ్యులు, వైయస్సార్ పార్టీ నాయకులు మహిళలు పాల్గొన్నారు.