Mar 18,2023 16:28
  • గ్రామపంచాయతీ,స్వచ్చభారత్ కార్మిక సంఘం  జిల్లా కార్యదర్శి  రమేష్

ప్రజాశక్తి - చిలమత్తూరు : గ్రామపంచాయతీ స్వచ్ఛభారత్ కార్మికులకు పెండింగ్ జీతాలు, సోపు, నూనె, చెప్పులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ  సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో చిలమత్తూరు ఎంపీడీవో కార్యాలయం ముందర పచ్చగడ్డి తిని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఈఓఆర్డీ శకుంతలమ్మకి వినతీపత్రం అందజేశారు. ఈ సందర్బంగా నాయకులు సిఐటీయు జిల్లా నాయకులు రమేష్, ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ చిలమత్తూరు మండలంలో గ్రామ పంచాయతి స్వచ్చ భారత్ కార్మికులు దాదాపు 80 మంది పనులు చేస్తున్నారు. స్వచ్చ భారత్ కార్మికులుగా ఉన్న వారికి 12 నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పని చేస్తున్న కార్మికులు కాలువలలో ఉన్న మురికి మలమూత్రాలు తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు జీతాలు అందక పోవడంతో వారి కుటుంబంలో అనేక ఒడిదుడకులకు గురవుతున్నారు. జీతాలు లేక కుటుంబంలో ఉన్న భార్యా పిల్లలు పస్థులు ఉండి ఎవరూ అప్పులు కూడా ఇవ్వకపోవడంతో అర్దాకలితో అలమటిస్తున్నారు. అదేవిధంగా కార్మికులు కనీస సౌకర్యాలు గుర్తింపు కార్డులు యూనిఫామ్, నూనె, సబ్బులు, చెప్పులు, గ్లౌజులు, మాస్కులు, తదితర సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు.‌ కావున వారి న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటీయు పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి రమేష్, వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సిఐటీయు మండల కార్యదర్శి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.