Aug 18,2022 20:59

దత్తిరాజేరు.. నిరసన చేపడుతున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి- దత్తిరాజేరు : ఉపాధ్యాయులకు పని ఒత్తిడితోపాటు, బోధనా సమయాన్ని తగ్గించే యాప్స్‌ను రద్దు చేయాలని కోరుతూ బుధవారం స్థానిక జెడ్‌పి ఉన్నత పాఠశాల ఎదుట పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దత్తిరాజేరు పాఠశాలలో నిర్వహిస్తున్న యాప్‌ల శిక్షణ కార్యక్రమ విరామ సమయంలో చేపట్టారు. ప్రభుత్వం ఉపాధ్యాయులకు డివైస్‌లు ఇవ్వకుండా తమ సొంత ఫోన్‌లలో యాప్‌లతో పని చేయమనడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ కిల్లాడ అప్పారావు, నాయకులు రామ నాయుడు, మాధవి, లత, లక్ష్మణరావు, పిఆర్‌టియు నాయకులు జగదీష్‌, పరశురాం, ఎపిటిఎఫ్‌ నాయకులు నాగభూషణ్‌, పిఆర్‌టియు నాయకులు సత్యారావు పాల్గొన్నారు.
బాడంగి : ఇంటిగ్రేటెడ్‌ యాప్‌పై ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరం చేస్తూ మండల విద్యాశాఖ అధికారికి గురువారం వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వంటివి తమ సొంత ఫోన్లో అప్లోడ్‌ చేయలేమని తెలిపారు. దాని వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని కోరారు.