
న్యూఢిల్లీ : యమహా మోటర్ ఇండియా మార్కెట్లోకి యమహా ఎఫ్‌జెడ్25 కొత్త మోటో జిపి ఎడిషన్‌ను విడుదల చేసింది. ఎక్స్ షోరూమ్ వద్ద దీని ధరను రూ.1,36,800గా నిర్ణయించింది. 'ది కాల్ ఆఫ్ ది బ్లూ' ప్రచారం కింద ఆవిష్కరించిన ఈ రోడ్‌స్టర్ బైక్ కొత్త ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుందని యమహా మోటార్ తెలిపింది. ఈ బైక్‌కు 249సిసి ఎయిర్ కూల్డ్, ఎస్‌ఒహెచ్‌సి, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో లభిస్తుందని పేర్కొంది.