Nov 29,2021 22:22

ప్రమాదకరంగా ఉన్న ఎగువ చెరువును పరిశీలిస్తున్న అధికారులు, ఎంపీపీ

ప్రజాశక్తి - కార్వేటినగరం : మండలంలోని గంగమంబాపురం ఎగువచెరువు ప్రమాదకరంగా ఉందని సమాచారం అందుకున్న ఎంపీపీ లతాబాలాజీ సోమవారం హుటాహిటిన సంఘటనా స్థలానికి చేరుకుని జేసిబి ద్వారా యుద్ధ ప్రాతిపదికన కల్వర్టుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ డిసెంబర్‌ 2వ తేది వరకు అల్పపీడనం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయ సిబ్బంది చెరువులపై దష్టి సారించి ప్రమాదకరమైన చెరువులు, కుంటలను గుర్తించి అధికారులకు నివేదికలు పంపాలన్నారు. మండలంలో ఎక్కడ ఎలాంటి పంట, ప్రాణనష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు. అనంతరం జేసిబితో ప్రమాదకరంగా ఉన్న కల్వర్టుకు మరమ్మతులు చేయించారు. దీంతో ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. వారి వెంట సర్పంచ్‌ లోకనాథ నాయుడు, మురాజ్‌ రెడ్డి, ఢిల్లీరెడ్డి, సతష్‌, ధనశేఖర్‌ వర్మ, ఈవోపీఆర్డీ హేమ కుమార్‌, శేఖర్‌ రెడ్డి, సచివాలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.