Oct 17,2020 07:43

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలిభిత్‌ జిల్లాలోని పూరాణ్‌పూర్‌ వద్ద శనివారం ఉదయం బస్సు, కారును ఢ కొన్న ఘటనలో తొమ్మిది మంది చనిపోగా.. 30 మంది గాయపడ్డారని పోలీస్‌ సూపరింటెండెంట్‌ జై ప్రకాష్‌ యాదవ్‌ తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.