Oct 18,2020 23:49

యుటిఎఫ్‌ జిల్లా నాయకురాలు
ఉమామహేశ్వరికి పితృవియోగం
ప్రజాశక్తి - ఒంగోలు టౌన్‌
యుటిఎఫ్‌ జిల్లా నాయకురాలు జి. ఉమామహేశ్వరికి పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి, కమ్యూనిస్టు పార్టీ నాయకులు గోనుగుంట నిత్యానందచారి ఆదివారం మృతి చెందారు. మహాప్రస్థానం వద్ద నిత్యానంద భౌతికకాయంపై సిపిఎం జిల్లా నేతలు రెడ్‌క్లాత్‌, సిపిఎం జెండాను కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సిద్ధయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జివి.కొండారెడ్డి, షేక్‌ మాబు, కంకణాల ఆంజనేయులు, జిల్లా నాయకులు జి. రమేష్‌, కాలం సుబ్బారావు, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.రవి, భారతి నర్సింగ్‌ హోం వైద్యులు డాక్టర్‌ కె.నాగేశ్వరరావు, జెవివి జిల్లా గౌరవాధ్యక్షులు ఎవి.పుల్లారావు, ప్రజాసంఘాల నాయకులు బి.రఘురామ్‌, వి.బాలకోటయ్య, కె.రమాదేవి తదితరులు నిత్యా నందచారి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. నిత్యానంద చారి కుమార్తె, యుటిఎఫ్‌ జిల్లా నాయకురాలు ఉమామహేశ్వరి, వారి అల్లుడు జెవివి జిల్లా నాయకుడు జయప్రకాష్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.