Jul 29,2021 22:37

శ్రీరామ్మూర్తి(ఫైల్‌)

ప్రజాశక్తి-అయినవిల్లి
యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు గుర్రాల శ్రీరామ్మూర్తి (92) అనారోగ్యంతో గురువారం మతి చెందారు. పిబి.ముత్తారావు, వి.సూర్య నారాయణ రాజు కాలంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా శ్రీరామ్మూర్తి చాలా కాలం పాటు పని చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో సంఘాన్ని ముందుకు నడిపించే బాధ్యతను తీసుకుని ఉద్యమం పట్ల అంకితభావంతో ఆయన పని చేశారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. సీనియర్‌ నాయకులు పివి.సూర్యనారాయణ యుటిఎఫ్‌ పతాకాన్ని కప్పి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు పెంకే వెంకటేశ్వరరావు, అధ్యక్షులు చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌ వర్మ, టి.కామేశ్వరరావు, ట్రెజరర్‌ నగేష్‌, కట్టా సురేష్‌, త్రిమూర్తులు పాల్గొన్నారు.