Jan 18,2022 15:11

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ కప్-2022 నిర్వహిస్తున్నట్టు యుటిఎఫ్ పట్టణ అధ్యక్షులు సునీల్ రాజ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశ్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు 12నెలలు అందరూ ఎవరి పనులలో వారు బిజిగా ఉంటారు. కానీ మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా అందరూ కలసి వయసు మరచి కొద్దిసేపు గడిపితే ఇంకా ఇంకా రెట్టింపు ఉత్సహాంతో పని చేయగలుగుతాము అనే ఆలోచనతో ఈ యూటీఫ్ ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము అన్నారు. విజేతల టీమ్స్కు పాల్గొన్న టీమ్స్కు 26వ తేదీ గణతంత్ర దినోత్సవ రోజున మునిసిపల్ ఆఫీస్ ప్రాంగణంలో మునిసిపల్ కమీషనర్, మునిసిపల్ చైర్ పర్సన్ , అసిస్టెంట్ మునిసిపల్ కమీషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో మునిసిపల్ ఉపాధ్యాయులు, మునిసిపల్ ఉద్యోగులు, మునిసిపల్ సచివాలయ ఉద్యోగులు, మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, కౌన్సిలర్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మాత్రమే ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి అర్హులు అన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే వారు 14 మంది ప్లేయర్స్ పేర్లు అలాగే వారి ఐడి కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి అన్నారు. టోర్నమెంట్లో పాల్గొనే టీం ఎంట్రీ ఫీస్ 1000/- వెయ్యి రూపాయలు చెల్లించాలన్నారు.మరిన్ని వివరాలకు సునీల్ రాజ్ కుమార్ 8074582178, గిరిబాబు 7013845593 సంప్రదించాలని కోరారు.