Jan 15,2022 16:24

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 18వ వార్డులో రాజకీయ కక్ష సాధింపుల నేపథ్యంలో డివిఆర్ కాలనీకి చెందిన ఉప్పుతోళ్ళ గోపి అనే యువకుడును అదే కాలనీకి చెందిన కౌన్సిలర్ కుమారుడు, వాలంటీర్ భంఢారు గోపి, భండారు పవన్, దివాకర్ కొంతమంది యువకులు మారణాయువాలతో శుక్రవారం రాత్రి కాలనీ ఆర్చి వద్ద కాపుకాసి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో తీవ్రంగా గాయపడి నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉప్పుతోళ్ళ గోపిని సిపిఎం నాయకులు సయ్యద్ ఖాసిం, బత్తుల వెంకటేశ్వర్లు పరామర్శించారు. దోఘలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు ఖాసిం మాట్లాడుతూ అధికార మదంతో  వైసీపీ కార్యకర్తలు అమాయక ప్రజలపై బౌతిక దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. బౌతిక దాడులకు పాల్పడటం సరైన పద్ధతి కాదని, రాజకీయంగా ఎదగడానికి బౌతిక దాడులు చేయడం శ్రేయస్కరం కాదని, అధికారం ఉందని మిడిసిపడితే, భవిష్యత్ లో వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని సూచించారు.