Mar 15,2023 16:32
  • ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  •  విషమంగా మారిన యువకుని పరిస్థితి

ప్రజాశక్తి-వేటపాలెం : బ్లేడుతో గొంతు కోసుకొని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు స్థానికులు వెంటనే గుర్తించి ద్విచక్ర వాహనంపై చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యం పొందుతున్న యువకుని పరిస్థితి విషమంగానే మారింది. ఈ ఘటన మండల పరిధిలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం జరిగింది స్థానికుల కథనం ప్రకారం కొంతమంది యువకులు మద్యం మత్తులో గలాటాకు దిగారు. ఆ ప్రాంతంలో ఉండే ఓ పెద్దాయన గొడవను సద్దుమణించే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన బి వెంకటేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడుపై చేయి చేసుకున్నాడు దీంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు బ్లేడుతో ఘటనా స్థలంలో గొంతు కోసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేగింది స్థానికులు వెంటనే స్పందించి ద్విచక్ర వాహనంపై చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు వైద్యం పొందుతున్న వెంకటేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు వెల్లడించారు అవుట్ పోస్ట్ లో సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు చీరాల రూరల్ సీఐ ఏ మల్లికార్జునరావు వేటపాలెం ఎస్సై జి సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు వెంకటేష్ ఆత్మహత్యయత్నానికి పాల్పడటానికి కారకుడైన పెద్దాయన ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది సమగ్ర సమాచారం కోసం స్థానిక రైల్వే స్టేషన్ చేతనే ఉన్న సీసీటీవీ పుట్టేజిని పోలీసులు పరిశీలించారు పోలీసులు బాధితుడు వాంగ్మూలం ఈపాటికి నమోదు చేసుకున్నారు పూర్తి వివరాలు సాయంత్రానికి వెల్లడి కానున్నాయి