Aug 08,2022 22:11
  • సచివాలయ మహిళా ఉద్యోగులను భాగస్వామ్యం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో మిల్లర్ల పాత్ర లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలని సూచించారు. వారి చొరవను బట్టి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలనాురు. ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబందించి ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలన్నారు. రైతులకు కనీసమద్దతు ధర ఖచ్చితంగా చెల్లించాలని. ఒక్క పైసా కూడా తగ్గకూడదని చెప్పారు ఆర్‌బికెల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ టెస్టింగ్‌, క్వాంటిటీ టెస్టింగ్‌ జరపాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎంఎస్‌పి ప్రక్రియ మీద రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు పెట్టాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు,అక్రమాలను నివారించడానికి పూర్తిస్దాయిలో చర్యలు తీసుకోవాలనాురు. ఆర్‌బికెల స్దాయిలోనే ''వే బ్రిడ్జీ''లను ఏర్పాటు చేయాలనాురు. ప్రతి ఖరీఫ్‌, రబీ ముగిసిన తర్వాత సాయల్‌ టెస్ట్‌ చేసే విధంగా ఒక కార్యక్రమానిు అందుబాటులోకి తీసుకురావాలని సిఎం అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా భూసారపరీక్షలు నిర్వహించాలని, అవసరం లేకపోయినా, విచక్షణ రహితంగా ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగానిు తగ్గించాలన్నారు. రైతు సాగుచేస్తున్న భూమి స్థితిగతులు ఏంటీ? ఎలాంటి పంటలకు అనుకూలం?ఎలాంటి రకాలు వేయాలి? ఎంతమోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలను దానిపై పూర్తి స్ధాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, సిఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సిఎస్‌ పూనం మాలకొండయ్య, సివిల్‌ సప్ల్తె కమిషనరు గిరిజాశంకర్‌, వ్యవసాయశాఖ కమిషనరు ప్రద్యుము, సివిల్‌ సప్ల్తెస్‌ కార్పొరేషన్‌ విసి వీరపాండ్యన్‌ పాల్గొన్నారు.