Aug 05,2022 08:22

అయినా ముందుకే : మనగగ్వా
హరారె :
బ్రిటన్‌ తదితర పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడం ద్వారా జింబాబ్వే అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని జింబాబ్వే అధ్యక్షులు మనగగ్వా విమర్శించారు. అయినా దేశాభివృద్ధి కోసం తమ కృషిని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. అభివృద్ధిని పట్టాలు తప్పించేందుకు ఆంక్షల పేరుతో పశ్చిమ దేశాలు చేసే ప్రయత్నాలు జయప్రదం కావని హెచ్చరించారు. బ్రిటన్‌, దాని మిత్రదేశాలు పూర్వపు వలస దేశమైన జింబాబ్వేపై ఆర్థిక యుద్ధం జరుపుతున్నా తాము మాత్రం తమ అభివృద్ధి ఆశయాలు సాధిస్తామని స్పష్టం చేశారు. జింబాబ్వే ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకే పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయని, ఇవి గత 20ఏళ్ళుగా కొనసాగుతునే వున్నాయని అన్నారు. పాలక జాను-పిఎఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసేలా ఎత్తుగడలు వేశారని, కానీ అందులో వారు విఫలమయ్యారని తెలిపారు. అక్రమంగా ప్రభుత్వాన్ని మార్చాలన్న వారి ప్రణాళికలు ఫలించలేదన్నారు.