గుంటూరు (తెనాలి) : సార్వత్రిక ఎన్నికల వేళ .. తెనాలి పోలింగ్ బూత్‌లో నిన్న ఉద్రిక్తత నెలకొన్న సంగతి విదితమే. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన తెనాలి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేతోపాటు మరో ఏడుగురు తనపై దాడి చేసినట్లు సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పై కేసు నమోదు
