న్యూఢిల్లీ : వెనిజులా రాజధాని కారకాస్‌లో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల 32 మంది మృతి చెందారు. వరుస భూప్రకంపనల వల్ల పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలోని మృతులకు సంతాపం, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాగా, వెనిజులాలో సంభవించిన తీవ్రమైన భూకంపాల వల్ల జరిగిన విధ్వంసం పట్ల నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. భారత ప్రజల తరపున, వెనిజులా ప్రభుత్వానికి, ప్రజలకు, ముఖ్యంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఈ క్లిష్ట సమయంలో బాధితులందరికీ సంఘీభావం తెలుపుతున్నాము. సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉంది అని మోడీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.








కామెంట్‌లు (0)