కొచ్చి : సిఎంఆర్‌ఎల్ ఆరోపణలకు సంబంధించి కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ కుమార్తె టి.వీణ మరోసారి ఈడి విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం ఆమె కొచ్చిలోని ఈడి జోనల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కేసులో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఒ) సేకరించిన 134 పత్రాలను ఈడి స్వాధీనం చేసుకున్న ఒకరోజు తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలలో ఆమె విచారణకు హాజరుకావడం ఇది రెండవసారి. జూన్ 17న సుమారు ఎనిమిది గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు, శశిధరన్ కార్త కుమార్తె, సిఎంఆర్‌ఎల్ అనుబంధ సంస్థ డైరెక్టర్ షిబీ ఎస్. కార్త, సిఎంఆర్‌ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ ఎస్. కార్త, అలాగే 'ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్' (ఇఐసిఐపిఎల్) డైరెక్టర్ వ్యవహరిస్తున్న శశిధరన్ కార్త భార్య జయ ఎస్. కార్తలను ఈడీ విచారించింది.
మరోసారి ఈడి విచారణకు హాజరైన టి.వీణ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 12:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)