ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిగంట వరకు 35.97 శాతం పోలింగ్‌

2 గంటల క్రితం

ap election
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 01:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అత్యధికంగా కనిగిరి, అత్యల్పంగా విశాఖ

ప్రజాశక్తి- విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 96.89 లక్షల ఓటర్లలో మధ్యాహ్నం 1:00 గంటల సమయానికి సుమారు 35.97 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు .మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ర్టవ్యాప్తంగా 37.13 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా మార్కాపురం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 63.36 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు 61.86, చిత్తూరు జిల్లా నగరిలో60.81, ఆత్మకూరు 45, బొబ్బిలి 49, సత్యసాయిలో 50, తిరుపతి 32, వెంకటగిరి 42, రేపల్లెలో 45, విజయవాడలో 36.40, గుంటూరులో 30.94, ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన విశాఖపట్నంలో 27.55 తో అత్యల్ప పోలింగ్ నమోదైంది

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్