ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) జి సాయి ప్రసాద్ పదవి కాలాన్ని కేంద్రప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు మరోసారి పొడిగిస్తునట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర సాధారణ పరిపాలన(పొలిటికల్)శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా గురువారం తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాయి ప్రసాద్ ఫిబ్రవరి 28వ తేది నుంచి సిఎస్‌గా పనిచేస్తున్నారు. ఆయన మే 31వ తేదితో పదవి విరమణ చేయాల్సి ఉండగా ఆరు నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని తొలుత కోరింది. రాష్ట్రం అభ్యర్ధన మేరకు జూన్ 1 నుండి నవంబర్ 30వ తేది వరకు తొలుత పొడిగించింది. ఈ పొడిగించిన తేది నవంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ఇప్పుడు మరో ఆరు నెలల పొడిగించాలని రాష్ట్రం ప్రభుత్వం సెప్టెంబర్ 29న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సారి కూడా కేంద్రం ఆమోదించి 2027 మే 31వ తేదీ వరకు పొడిగించింది.
ఏపి సిఎస్ పదవీకాలం పొడిగింపు
33 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)