ప్రజాశక్తి - విజయవాడ : విధి నిర్వహణలో ఉండగా విజయవాడ నున్న పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అహమ్మద్ అలీ (55) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ నిరసన కార్యక్రమం బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సిఐకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలీ మృతి పట్ల విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పలువురు డిసిపిలు, ఎసిపిలు, సిఐలు, ఇతర పోలీసు సంతాపం తెలిపారు.
హోం మంత్రి దిగ్భ్రాంతి
అలీ మృతి పట్ల రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజల భద్రత కోసం నిరంతరం సేవలందించే పోలీసు కుటుంబంలో సమర్థవంతమైన అధికారిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢసానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వ ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.







కామెంట్‌లు (0)