భారత వాతావరణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 13వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదులుతూ, తదుపరి 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారొచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా గురువారం కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వెల్లడించింది.







కామెంట్‌లు (0)