3 రోజుల్లో 1.18 లక్షల దరఖాస్తులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లలో మూడో రోజు భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. సర్పంచ్ స్థానాలకు 9,963, వార్డు సభ్యుల స్థానాలకు 45,846 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 17వ తేదీ నాటికి నమోదైన వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. తొలిరోజు వార్డు సభ్యులకు 5,780, సర్పంచ్ స్థానాలకు 3,303 నామినేషన్లు దాఖలవగా, రెండో రోజు వరుసగా 40,503, 12,719 నామినేషన్లు అందాయి. మూడు రోజుల్లో వార్డు సభ్యుల స్థానాలకు 92,129, సర్పంచ్ స్థానాలకు 25,985 నామినేషన్లు అందాయి. మొత్తం 1.18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తొలిదశలో 42 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 201 మండలాల్లో 3,949 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో తొలిదశలో ఎన్నికలు నిర్వహించడం లేదు.








కామెంట్‌లు (0)